రాజశేఖర్ సినిమాలో ఇంకో ఇద్దరమ్మాయిలు !

రాజశేఖర్ సినిమాలో ఇంకో ఇద్దరమ్మాయిలు !

ఇటీవలే 'గరుడవేగ' సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' అనే సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.  పీరియాడిక్ థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ సినిమాలో నందిత శ్వేత ఒక ముఖ్య పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.

ఈమెతో పాటే మరో ఇద్దరు అందాల భామలు కూడ ఈ సినిమాలో నటించనున్నారు.  వారిలో 'బాహుబలి, ఎవడు, కెమెరామెన్ గంగతో రాంబాబు' వంటి సినిమాల్లో ప్రత్యేక గీతాలతో బాగా ఫేమస్ అయిన బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్ ఒకరు కాగా 'హార్ట్ అటాక్, క్షణం' సినిమాల హీరోయిన్ అదా శర్మ ఇంకొకరు.  ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్, రాజశేఖర్ కలిసి నిర్మించనున్నారు.