ఎన్‌టీఆర్30లో మరో యంగ్ హీరో.. ఎవరంటే..?

ఎన్‌టీఆర్30లో మరో యంగ్ హీరో.. ఎవరంటే..?

టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తి కలిగించే కాంబోల్లో ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఈ కాంబోలో సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉంటాయి. వీరి కాంబోలో ఇదివరకు వచ్చిన తొలి సినిమా అరవింద సమేత ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరు మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా అయినను పోయిరావలె హస్తినకు అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌ది చాలా పవర్ ఫుల్ పాత్రగా కనిపించనుందని టాక్. అయితే తన ప్రతి సినిమాలో హీరో, విలన్ ఇద్దరినీ పవర్ ఫుల్‌గా చూపించే త్రివిక్రమ్ ఈ సినిమాకి డోస్ ఇంకా పెంచాడంట.  ఈ సినిమా ఓ కీలకమైన పాత్రకి ఓ యువ హీరోను ఎంపిక చేశారంట. అంతేకాకుండా ఆ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా కనిపించనుంది. అయితే ఇంతటి పవర్ ఫుల్, కీలక పాత్రకి ఎవరిని ఎంపిక చేశారో తెలియదు కానీ, బయట మాత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా అందరినీ కట్టిపడేసిన నవీన్ పోలిశెట్టి పేరు వినిపిస్తుంది. అతడి నటన, టైమింగ్ అన్ని నచ్చడంతో త్రివిక్రమ్ అతడిని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.