అక్కినేని, దాసరి, హరికృష్ణ విగ్రహాలు తొలగింపు

 అక్కినేని, దాసరి, హరికృష్ణ విగ్రహాలు తొలగింపు

విశాఖపట్నంలోని బీచ్‌ రోడ్డులో సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారని పేర్కొంటూ నిన్న అర్ధరాత్రి విగ్రహాలను తరలించారు. విశాఖపట్నానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను తెచ్చి సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని జనసేన నేత బొలిశేట్టి సత్యనారాయణ గతంలో కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం..విగ్రహాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈక్రమంలో స్పందించిన కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించారు. ఈ విగ్రహాలను మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఏర్పాటు చేయగా.. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు.