అంతరిక్షం 'మిహిర' మిషన్ సక్సెస్ అయిందా..?

అంతరిక్షం 'మిహిర' మిషన్ సక్సెస్ అయిందా..?

తెలుగు సినిమాలో క్రమంగా మార్పులు వస్తున్నాయి.  హాలీవుడ్ స్థాయి చిత్రాలతో పోటీ పడేందుకు మనవాళ్ళు కూడా సిద్ధం అవుతున్నారు. ఇప్పటి సినిమాలు చూస్తుంటే మూస పద్దతికి స్వస్తి పలికి టెక్నాలజీని అందిపుచ్చుకొని.. సినిమాలు చేస్తున్నారనే అనిపిస్తుంది.  స్పేస్ మూవీ గ్రావిటీ హాలీవుడ్ లోనే కాకుండా.. ఇండియాలోనూ సక్సెస్ అయింది.  ఇటీవలే వచ్చిన టిక్ టిక్ టిక్ సినిమా కూడా స్పేస్ కు సంబంధించిన సినిమానే.  ఆ సినిమా సైతం మెప్పించింది.  ఇప్పుడు అదే కోవలో వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న అంతరిక్షం సినిమా ఈరోజు రిలీజ్ అయింది.  యూఎస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షో లు ముగిశాయి.  ట్విట్టర్ లో స్పందన ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.  

వరుణ్ తేజ్.. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి చేసిన అంతరిక్షం ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అయింది.  ఇలాంటి సీరియస్ సినిమాలకు గ్రాఫిక్స్ పనితనం చాలా అవసరం.  గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటె సినిమా ఇంకా బాగుండేది.  తెలుగు సినిమా అనే సరికి అందరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు.  ఈ సినిమా జానర్ పూర్తిగా వేరు కావడంతో ఇందులో ఆ ఎంటర్టైన్మెంట్ ఉండదు.  మిహిర అనే శాటిలైట్ లో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి వరుణ్ తేజ్, అదితిరావు హైదరి ఎలా కృషి చేశారు.. అన్నది కథ.  ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలతోనే ముగిసింది.  సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలౌతుంది.  సెకండ్ హాఫ్ ను ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు సంకల్ప్ రెడ్డి.  మొత్తానికి మిషన్ మిహిర సక్సెస్ అయిందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.