ఆసక్తికరంగా అంతరిక్షం ట్రైలర్ !

ఆసక్తికరంగా అంతరిక్షం ట్రైలర్ !

సంకల్ప్ రెడీ డైరెక్షన్లో వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం' ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.  ఆ ట్రైలర్ చూస్తే 'ఘాజి'తో తన సత్తాను నిరూపించుకున్న సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను కూడ అదే తరహాలో ఆసక్తికరంగా రోపొందించి ఉంటారని అనిపిస్తోంది.  స్పేస్ నేపథ్యంలో మంచి సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన విజువల్స్, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, దేశభక్తి కలిగిన శాస్త్రవేత్తగా వరుణ్ తేజ్ పాత్ర ఆకట్టుకుంటున్నాయి.  ప్రశాంత్ సంగీతం కూడ బాగుంది.   నిర్మాతాలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాను క్వాలిటీగా తయారుచేశాయి.  మొత్తం మీద తెలుగులో మొదటిసారి రూపొందిన ఈ స్పేస్ థ్రిల్లర్ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కలుగుతోంది.