అంతర్వేది రధానికి ట్రైల్ రన్.. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ?

అంతర్వేది రధానికి ట్రైల్ రన్..  ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ?

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మొదలు కానుండడంతో  24 న రథోత్సవం సమయానికి నూతన రథంలో స్వామి వారి ఊరేగించడానికి ఆలయ అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది రథం ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరేగింపుగా రోడ్లపై వెళ్తున్నప్పుడు టర్నింగ్ తిరగడానికి నూతన టెక్నాలజీతో రథానికి జాకీలు ఏర్పాటు చేశారు. రథానికి  నూతన టెక్నాలజీ ఉపయోగించి హైడ్రాలిక్ బ్రేకులు అమర్చారు. ఈ రథాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించి అనంతరం స్థానికులు,ఇంజనీరింగ్ సిబ్బంది, మంత్రి వేణు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ ఈ ట్రైలర్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రథం తయారీ ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అనుకున్న టైం కంటే ముందుగానే పనులు పూర్తి చేశామని ఆయన అన్నారు.