యాంటిబాడీలు శరీరంలో ఎన్నిరోజులు ఉంటాయో తెలుసా? 

యాంటిబాడీలు శరీరంలో ఎన్నిరోజులు ఉంటాయో తెలుసా? 

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి మనం రక్షించబడాలి అంటే శరీరంలో యాంటి బాడీలు అభివృద్ధి చెంది ఉండాలి.  శరీరంలో యాంటి బాడీలు అభివృద్ధి చెందితే, ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా బయటపడొచ్చు.  ఒకసారి యాంటీబాడీలు డెవలప్ అయ్యాక, అవిఎంతకాలం యాక్టివ్ గా ఉంటాయి అనే విషయం గురించి పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు.  వీరి పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి.  శరీరంలో యాంటీబాడీలు సుమారుగా ఏడు నెలల వరకు ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు.  పోర్చుగల్ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ మాలిక్యులర్ సంస్థ పరిశోధకులు దీనిపై పరిశోధనలు చేశారు.  కరోనా నుంచి కోలుకున్న 90శాతం మంది శరీరంలో యాంటీబాడీలు ఏడు నెలల వరకు ఉంటాయని పరిశోధనలో తేలింది.  యాంటీబాడీల స్థాయి వయస్సుతో సంబంధం లేదని పరిశోధనలో తేలింది.  వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటె యాంటిబాడీలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతాయని పరిశోధనలో తేలింది.