బీజేపీ సంబరాలకు స్వీట్లు సిద్దం..

బీజేపీ సంబరాలకు స్వీట్లు సిద్దం..

దేశ ప్రజల భవితవ్యాన్ని నిర్దేశించే లోకసభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ తరువాత రాబోయే ప్రభుత్వం మాదేనంటూ బీజేపీ విశ్వాసంతో ఉంది. దీంతో రేపు ఫలితాల అనంతరం సంబరాలను ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు సిద్దం చేసింది. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నపుడు ఆయా పార్టీల కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ సంబురాల్లో మునిగితేలిపోతుంటారు. ఇందుకోసం బీజేపీ ఖరీదైన స్వీట్లను ఆర్డర్ ఇచ్చింది. ఢిల్లీ చాంద్నీ చౌక్ ప్రాంతానికి చెందిన ఓ స్వీట్ దుకాణంలో ప్రత్యేక స్వీట్లను తయారు చేయిస్తుంది. కమలం ఆకారంలో ఉండే ఈ స్వీట్ లో బాదం, పిస్తాలను వేసి తయారుచేస్తున్నారు. ఈ స్వీట్ ధర కిలో 2 వేల రూపాయలు మాత్రమే.