అను చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకుంటుందట !

అను చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకుంటుందట !

మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా అనేది ప్రతి హీరోయిన్ కు ఎదురయ్యే ప్రశ్న.  దీనికి చాలా మంది హీరోయిన్లు టైమ్ రానివ్వండి చూద్దాం అంటూ తప్పించుకుంటే కొందరు మాత్రం క్రేజీ సమాధానాలు చెబుతుంటారు.  అను ఇమ్మాన్యుయేల్ కూడ అలాంటి సమాధానమే చెప్పింది. 

తాను మొదటగా స్కూల్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ప్రేమలో పడ్డానని అన్న ఆమె ప్రేమ అనేది గొప్ప ఫీలింగ్ అని, రెండు హృదయాల్ని కలిపే భావనని, చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకుంటానని క్లారిటీగా చెప్పేసింది.  తాజాగా 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె ధనుష్, నాగార్జునల సినిమాలో సైతం అవకాశం దక్కించుకుంది.