విజయ్ ను మిస్ చేసుకోవడానికి బన్నీనే కారణమా..!!?

విజయ్ ను మిస్ చేసుకోవడానికి బన్నీనే కారణమా..!!?

అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13 వ తేదీన విడుదల కాబోతున్నది.  ఇగో ఉన్న అమ్మాయిగా ఇందులో కనిపిస్తున్నది అను.  తన కెరీర్లో మొదటిసారి అను సినిమాలో ఎక్కువగా మాట్లాడబోతున్నాడట.  అత్తారింటికి దారేదిలో ప్రణీత క్యారెక్టర్ మొదట అనుకే వచ్చిందట.  ప్రణతి క్యారెక్టర్ అలా ఉంటుంది అందుకే అందులో చేయలేదట.  అజ్ఞాతవాసి సినిమా ఆఫర్ వచ్చినపుడు  వదులుకోకూడదని చెప్పి ఒకే చెప్పినట్టు అను ఓ ఇంటర్వ్యూ లో పేర్కొన్నది.  

గీత గోవిందం సినిమా ఆఫర్ వచ్చినా చేయకపోవడానికి ఓ కారణం ఉందని, ఆ టైమ్ లో బన్నీతో నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నట్టు చెప్పింది.  డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలనే సినిమా మిస్ అయినట్టుగా అను పేర్కొన్నది.  గీత గోవిందం సినిమాను తాను చూడలేదని, సినిమా బాగుందని అందరు అంటుంటే ఆ సినిమా మిస్ అయినందుకు కొంచెం ఫీల్ అవుతున్నట్టు చెప్పుకొచ్చింది అను.