అను ఇమ్మాన్యుయేల్‌కి అవకాశం దొరికింది !

అను ఇమ్మాన్యుయేల్‌కి అవకాశం దొరికింది !

 

పవన్ కళ్యాణ్ అల్లు అరుణ్ లాంటిస్ టార్ హీరోలతో సినిమాలు చేసినా అను ఇమ్మాన్యుయేల్ లక్ మారలేదు.  'అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజారెడ్డి అల్లుడు' లాంటి సినిమాలు వరుసగా విఫలమవడంతో ఆమె కెరీర్ గాడి తప్పింది.  చాలా కాలం ఆమె గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.  ఈ లాంగ్ గ్యాప్ తరవాత ఆమెకు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమా చేసే ఛాన్స్ దొరికింది.  పాండిరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాలో ఉండనుంది.  ఒకరకంగా ఇది ఆమెకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు.  ఈ సినిమా గనుక విహజయం సాధిస్తే ఆమె కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుంది.