చైతు కోసం స్టార్ హీరో సినిమా వదులుకున్న అను

చైతు కోసం స్టార్ హీరో సినిమా వదులుకున్న అను

మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్  నటించనున్నారని ఒకరు అను ఇమ్మానుయేల్ కాగా, మరో హీరోయిన్ గా శృతి హాసన్ నటించనుందని తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నుండి అను ఇమ్మానుయేల్ తప్పుకున్నారని తెలుస్తోంది. 

దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..డేట్స్ కుదరకపోవడం వల్లే అను ఇమ్మానుయేల్ తప్పుకున్నారు. ప్రస్తుతం చైతు సరసన శైలజా రెడ్డి సినిమాలో నటిస్తోంది. అమర్ అక్బర్ ఆంటోనికి అమెరికా షెడ్యూల్ కోసమే దాదాపు 50 రోజులు డేట్స్ అవసరం అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరి ఆమె స్థానంలో చిత్రబృందం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో ఎలాగైనా హిట్ కొట్టాలని శ్రీను వైట్ల భావిస్తున్నాడు.