65వ ఏట జోడీ కట్టిన జలోటా

65వ ఏట జోడీ కట్టిన జలోటా

ప్రముఖ భక్తి గీతాల గాయకుడు, గజల్ సింగర్ అనూప్ జలోటా.. ఇప్పుడు వార్తల్లో వ్యక్తయ్యాడు. అయితే అందుక్కారణం ఆయనలోని రసికతే. 65 ఏళ్ల అనూప్ జలోటా.. 28 ఏళ్ల అప్ కమింగ్ గాయని జస్లీన్ మాథుర్ తో ప్రేమలో పడ్డాడని, వారిద్దరూ కొంతకాలంగా కలిసి ఉంటున్నారని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. సల్మాన్ ఖాన్ యాంకరింగ్ చేస్తున్న బిగ్ బాస్-12 ఓపెనింగ్ షోలో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఇండస్ట్రీ విస్తుపోయింది. 

వారిద్దరూ చనువుగా ఉండడం.. ఏ దాపరికాల్లేకుండా వ్యవహరించడమే గాక.. ఎంతో క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఆ చనువుకు కారణాలేంటో తెలుసుకుందామని అంతా ఆసక్తి కనబరిస్తే.. అది తమ ప్రైవేటు వ్యవహారమని, ఇతరులకు ఇబ్బందేమిటని జలోటా ప్రశ్నించడంతో అందరికీ కన్ఫామ్ అయిపోయింది. ఇక బిగ్ బాస్-11 విన్నర్ శిల్పా షిండే వ్యాఖ్యలైతే ఆ ఇద్దరి బంధాన్ని ఖాయపరుస్తున్నాయి. వారి బంధాన్ని షిండే సమర్థించింది. నచ్చిన వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు అభ్యంతరపెట్టాలంటూ ఆమె వ్యాఖ్యానించింది. 

65 ఏళ్ల అనూప్ జలోటా.. 28 ఏళ్ల జస్లీన్ మాథుర్ ల బంధం మొత్తానికి బిగ్ బాస్ షోలోనే కాకుండా రియాల్టీలో కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఇక జలోటా మీద ఈర్ష్యపడుతూ చాలా మంది సరదాగా చేస్తున్న కామెంట్లు నవ్వు తెప్పిస్తున్నాయి.