డార్లింగ్ గురించి అనుష్క అదిరిపోయే మెసేజ్

డార్లింగ్ గురించి అనుష్క అదిరిపోయే మెసేజ్

ప్రభాస్... అనుష్కలు కలిసి చాలా సినిమాలు చేశారు.  భిల్లా, మిర్చి, బాహుబలి సీరీస్ లు ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు.  ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.  ప్రభాస్ గురించిన ఏ న్యూస్ అయినా అనుష్కకు స్పెషల్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.  ఈ లుక్ పై అనుష్క స్పందించింది. 

"సాహో నుంచి వస్తున్న ప్రతిదీ.. నెక్ట్స్ ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు స్కైలోకి వెళుతున్నాయి. ఆగస్ట్ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్ కు - యూవీ క్రియేషన్స్ కు.. సుజిత్ కు.. టీమ్ లోని ప్రతి టెక్నీషియన్ కు ఆల్ ది బెస్ట్. ఎంతో ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నా" అని తన పేస్ బుక్ పేజీ ద్వారా పోస్ట్ చేసింది అనుష్క.  సాహో సినిమా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ అవుతున్నట్టు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే.