చిరు సినిమాలో అనుష్క.. నిజమేనా ?

చిరు సినిమాలో అనుష్క.. నిజమేనా ?

 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' ఆఖరి దశ షూటింగ్లో ఉంది.  ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.  ఇందులో అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా, కిచ్చ సుదీప్ లాంటి స్టార్లు నటిస్తున్నారు.  వీరితో పాటే స్టార్ హీరోయిన్ అనుష్క సైతం ఒక అతిథి పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే దీనిపై ఇప్పటి వరకు నమ్మదగిన సమాచారమేదీ బయటకురాలేదు.  ఒకవేళ యూనిట్ ప్రేక్షకులకు సప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిందా అనే అనుమానాలు వస్తున్నాయి.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరెకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.