సైరాలో అనుష్క పాత్రేంటి అంటే సైలెన్స్ అంటున్నారే..!!

సైరాలో అనుష్క పాత్రేంటి అంటే సైలెన్స్ అంటున్నారే..!!

మెగాస్టార్ సైరా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ లో బిజీ అయ్యింది.  ఆగష్టు 22 వ తేదీన ఆడియో, ట్రైలర్ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు.  సినిమాపై అంచనాలు ఉండటంతో దానికి తగ్గట్టుగా ప్రమోషన్ చేసేందుకు సిద్ధం అవుతున్నది యూనిట్.  

ఇందులో బాహుబలి హీరోయిన్ అనుష్క ఓ కీలక పాత్ర చేసింది. అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర చేసిందని చేసిందని వార్తలు వచ్చాయి.  అయితే, అనుష్క రోల్ అదికాదని, ఇందులో అసలు ఝాన్సీ లక్ష్మీబాయి రోల్ కు సంబంధించిన ఎలాంటి సన్నివేశాలు ఉండవని యూనిట్ చెప్తోంది.  అనుష్క ఇందులో స్టోరీ టెల్లర్ గా కనిపిస్తోందట.  అంటే.. అనగనగా అంటూ బామ్మలు పిల్లలను చుట్టూ కూర్చోపెట్టుకొని కథ చెప్పినట్టుగా అన్నమాట.  అనుష్క పాత్ర ఇదే అని ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా.