రానాకి అనుష్క ఆల్ ద బెస్ట్

రానాకి అనుష్క ఆల్ ద బెస్ట్

'బాహుబలి' 'బాహుబలి 2' 'రుద్రమదేవి' వంటి సినిమాలలో కలిసి నటించారు రానా, అనుష్క. రానా 'అరణ్య' విడుదల సందర్భంగా అనుష్క కు ప్రత్యేకంగా గూడీస్ ని కానుకగా పంపాడు. ఈ విషయాన్ని ఇన్ స్టా ద్వారా వెల్లడించింది అనుష్క. అంతే కాదు ''థాంక్యూ రానా బ్రో.. నాకు ఇవి బాగా నచ్చాయి. 'అరణ్య' టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు'' అని పోస్ట్ చేసింది. రానా పంపిన గూడీస్ తో పాటు తన పెట్ డాగ్ ని నిలబెట్టిన ఫోటో షేర్ చేసింది అనుష్క. బాహుబలి నుంచి వీరిద్దమధ్య చక్కని బాండింగ్ ఏర్పడింది. చిత్ర పరిశ్రమలోని పలువురు సన్నిహితులకు రానా స్పెషల్ గా 'అరణ్య' గూడీస్ పంపాడు. వారందరూ సోషల్ మీడియా వేదికగా రానాకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అరణ్య' సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన లభించటం లేదు. అయితే సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలమీద మోయటమే కాకుండా అద్భుతంగా నటించిన రానాకు మాత్రం అభినందనలు దక్కుతున్నాయి.