అతిలోక సుందరిగా అనుష్క..!!
అతిలోక సుందరి ఎవరు అంటే శ్రీదేవి అని చెప్తారు. ఆ అతిలోక సుందరి ఇప్పుడు లేదు. జూనియర్ అతిలోక సుందరి అంటే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అనే అంటారు. అందంగా, అద్భుతమైన డ్రెస్ తో కనిపిస్తే వాళ్ళను అతిలోక సుందరి అని పిలవడం పరిపాటి. ఎందుకంటే చూడగానే ఆకర్షిస్తారు.. దేవకన్యలా కనిపిస్తారు.
ఇప్పుడు అలా దేవకన్యలా ఆకర్షించింది ఎవరు అనే కదా అనుమానం. ఇంకెవరు బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క అలియాస్ విరుష్క. ఫ్యాషన్ విభాగంలో అనుష్క ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూనే ఉంటుంది. కొత్త కొత్త డ్రెస్ లతో ఆకట్టుకుంటుంది. ఇటీవలే విరుష్క ఓ అవార్డు వేడుకకు హాజరైంది. ఈ వేడుకకు హాజరైన ప్రేక్షకుల చూపులన్నీ అనుష్కవైపే ఉన్నాయట. చివరికి సెలెబ్రిటీలు సైతం విరుష్కను చూస్తుండిపోయాడు. వైట్ కలర్ డ్రెస్ లో అచ్చంగా దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నది. పైగా థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ కూర్చుంది. ఆ వేడుకకు హాజరైన రణ్వీర్ సింగ్ సైతం విరుష్క అందానికి ఫిదా అయ్యాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)