గవాస్కర్ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన అనుష్క...

గవాస్కర్ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన అనుష్క...

నిన్న ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు కీలకమైన క్యాచ్ లను వదిలేసాడు. ఆ కారణంగా పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత తమ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ 5 బంతులలో ఒకే పరుగు చేసి పెవిలియన్ కు చేరాడు. దాంతో ఈ మ్యాచ్ కు కామెంట్రీ చేస్తున్న భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్... ''ఆటగాడు ఎలా ప్రాక్టీస్ చేస్తాడో అలానే ఆడుతాడు. లాక్ డౌన్ లో అతను అనుష్క శర్మ బంతులతో ప్రాక్టీస్ చేసాడు'' అని తెలిపాడు. అయితే డబుల్ మీనింగ్ వచ్చేలా గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే గవాస్కర్ చేసిన వ్యాఖ్యల పై విరాట్ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. అనుష్క తన పోస్ట్ లో... ''మిస్టర్ గవాస్కర్... మీ కామెంట్ చాలా అసహ్యకరమైనది. అయితే మీరు భర్త ఆటకు సంబంధించి భార్యను ఇలా ఎందుకు కామెంట్  చేయాలని మీరు అనుకున్నారో అనేది నేను వివరించాలనుకుంటున్నాను. నేను తప్పకుండ చెప్పగలను మీరు ఇన్ని ఏళ్ళుగా కామెంట్రీ చేస్తున్నప్పుడు క్రికెటర్ యొక్క వ్యక్తిగత విషయాలను ప్రస్తావించలేదు. అందుకే అందరూ మిమల్ని గౌరవిస్తారు. మరి ఇదే గౌరవం మన ఇద్దరి మధ్యలో ఉండాలని మీరు ఆలోచించలేదా ?. గత రాత్రి నా భర్త ఆటకు సంబంధించి నా పై వ్యాఖ్యానించడానికి మీ మనస్సులో ఇంకా చాలా పదాలు, వ్యాఖ్యలు కలిగి ఉన్నాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది 2020నే కావచ్చు కానీ నా కోసం విషయాలు ఇప్పటికీ మారవు. నన్ను ఎప్పుడు క్రికెట్‌లోకి లాగడం మానేస్తారో, అప్పుడు నేను ఈ స్వీపింగ్ స్టేట్‌మెంట్‌ లను ఇవ్వడం మానేస్తాను. మిస్టర్ గవాస్కర్, ఈ ఆటలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారిలో మీరు ఒకరు. మీరు ఎప్పుడు నా పేరు ప్రస్తావించారో ఆ సమయంలో నేను ఏం చెప్పాలి అనుకున్నానో అదే ఇప్పుడు  చెప్తున్నాను'' అంటూ అనుష్క ఘాటుగా సమాధానం ఇచ్చింది

ఇక కోహ్లీ ఆటతో అసహనానికి గురైన బెంగళూరు అభిమానులకు గవాస్కర్ వ్యాఖ్యలతో మరింత ఆగ్రహం కలిగింది. దాంతో గవాస్కర్ ను కామెంట్రీ ప్యానల్ నుండి తొలిగించాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 206 పరుగులు చేయగా బెంగళూరు 109 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.