సైలెన్స్ ను బ్రేక్ చేయబోతున్న అనుష్క..!!

సైలెన్స్ ను బ్రేక్ చేయబోతున్న అనుష్క..!!

బాహుబలి తరువాత అనుష్క శెట్టి చేస్తున్న సినిమా సైలెన్స్..  సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఎక్కవభాగం అమెరికాలో జరిగింది.  ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా అనే, ఈ మూవీకి సంబందించి అనుష్క లుక్ ఎలా ఉండబోతుంది.  ఎలాంటి షాకులు ఇవ్వబోతుంది అనే క్యూరియాసిటి అందరిలోనూ ఉన్నది.  

ఈ క్యూరియాసిటీకి త్వరలోనే చెక్ పెట్టబోతున్నారు.  అనుష్క సైలెంట్ లుక్ ను ఈనెల 11 వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.  పీపుల్స్ మీడియా పతాకంపై కోన వెంకట్ సినిమాను నిర్మిస్తున్నారు.  హేమంత్ మధుకర్ దర్శకుడు.  బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ పెరిగింది.