నాగార్జునకు థ్యాంక్స్ చెప్పిన అనుష్క !

నాగార్జునకు థ్యాంక్స్ చెప్పిన అనుష్క !

 

లేడీ సూపర్ స్టార్ అనుష్క కెమెరా ముందు అడుగుపెట్టి 14 ఏళ్ళు గడిచింది.  'అరుంథతి, బాహుబలి' లాంటి భారీ విజయాలతో పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకుంది స్వీటీ.  ఈ సందర్బంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తాను ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంది.  ముఖ్యంగా తనకు మొదటి సినిమా 'సూపర్'లో ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ కు, హీరో నాగార్జునకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది.  సూపర్ తర్వాత డాన్, ఢమరుకం, రగడ వంటి సినిమాల్లో నాగార్జునతో కలిసి నటించింది అనుష్క.