నయన్ స్థానంలో అనుష్క ?

నయన్ స్థానంలో అనుష్క ?

 

నయనతార, అనుష్క.. ఇద్దరూ ఒకేస్థాయి హీరోయిన్లు.  ఇద్దరికీ ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ ఉంది.  అందుకే ఒకరి స్థానాన్ని ఇంకొకరు రీప్లేస్ చేయనున్నారు.  మణిరత్నం స్టార్ట్ చేసిన భారీ చిత్రం 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో మొదట నయనాత్రను కథానాయకిగా అనుకున్నారు.  కానీ నయనతార వరుసగా భారీ సినిమాలు చేయాల్సి ఉండటం వలన మణిరత్నం కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట.  అందుకే ఆమె స్థానంలో అదే స్థాయి పేరున్న అనుష్కను తీసుకోవాలని మణిరత్నం భావిస్తున్నారట టాక్.  ఇకపోతే అనుష్క ప్రస్తుతం 'సైలెన్స్' అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తోంది.