కేంద్రమంత్రి మనోజ్‌ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్రమంత్రి మనోజ్‌ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎవరైనా వేలెత్తి చూపితే వారి వేళ్లు నరికేస్తామంటూ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘాజీపూర్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన బీజేపీని విమర్శించే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ వైపు పార్టీపై ఆరోపణలు చేసే వారి పనిపడతాం అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్త పనితీరును ఎవరైనా వేలెత్తి చూపితే వారిని ఉపేక్షించమని అన్నరాఉ. ఈ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నా విమర్శించిన నాలుగు గంటల్లోపు వారి వేళ్లు నరికేస్తామని హెచ్చరించారు. అవినీతిని నిర్మూలించడం, అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ఎంతో కష్టపడుతోందని అన్నారు. బీజేపీ కార్యకర్తలపై ఆరోపణలు చేసేవారి కళ్లు కూడా క్షేమంగా ఉండమని వ్యాఖ్యానించారు.