ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా శంకబ్రత బాగ్చి

ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా శంకబ్రత బాగ్చి

ఆంధ్రప్రదేశ్‌ అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్‌ గా శంకబ్రత బాగ్చిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖలో డైరెక్టర్‌గా ఉన్న శంకబ్రత.. ఆ విభాగంలో సీనియర్ అధికారిగా ఉన్నారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పునేఠా ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను తక్షణం ఆ విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.