ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే  శ్రీనివాస్‌ రాజీనామా లేఖ సమర్పించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజీనామా కంటే ముందే దమ్మాలపాటి రాజీనామాను ఆమోదించి.. ఆ లేఖను గవర్నర్‌కు పంపించారు. 2016 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు.