హెచ్‌ఐవీ రోగుల్లో ఏపీ నెంబర్ 2

హెచ్‌ఐవీ రోగుల్లో ఏపీ నెంబర్ 2

దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతోన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎయిడ్స్ అతి భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధిని నిర్మూలించేందుకు అనేక పరిశోధనలు జరుగుతున్నా దానికి మందు కనిపెట్ట లేక పోయారు. అయితే గతంతో పోలిస్తే ఈ వ్యాధి బారిన పడినవారు ఎక్కువ రోజులు బతికే అవకాశాలున్నాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పోషకాహరం, మందులు క్రమం తప్పకుండా తీసుకొంటే ఇతరుల మాదరిగానే జీవనం సాగించే అవకాశం ఉంది.

ఇక తాజాగా దేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగుల్లో ఆంధ్రప్రదేశ్‌ సెకండ్ ప్లేస్ లో తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచాయి. 2018 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఈ మహమ్మారితో బాధపడుతుండగా అందులో 1.82 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లో, 78వేల మంది తెలంగాణలో ఉన్నారని తేలింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదిక వలన ఈ వివరాలు బయటకొచ్చాయి.