ఇంగ్లీష్ మీడియం బిల్లుకు ఆమోదం

ఇంగ్లీష్ మీడియం బిల్లుకు ఆమోదం

ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలు వచ్చినా.. తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల విషయంలో వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఆక, ఆయన ప్రతిష్టాత్మకంగా భావించిన ‘ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం’ బిల్లును ఇవాళ ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే, మండలిలో సూచించిన సవరణలు తిరస్కరించిన అసెంబ్లీ.. ఎలాంటి సవరణలు లేకుండానే శాసన సభ ఆమోదించింది... ఇక, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీష్ బోధన అవసరం అన్నారు. పేద విద్యార్థుల కోసం రైట్‌ టు ఇంగ్లీష్‌ విధానం తీసుకొచ్చామన్నారు. ఇంగ్లీష్‌ మీడియం బిల్లును శాసన మండలిలో అడ్డుకున్నారని సవరణలు చేస్తూ అసెంబ్లీకి తిప్పి పంపారన్నారు. ఇప్పుడు మళ్లీ మండలికి బిల్లు పంపుతామని... మండలి బిల్లు అడ్డుకున్నా చట్టంగా మారుతుందని స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్.. పేద విద్యార్థుల కోసం రైట్‌ టు ఇంగ్లీష్‌ విధానం తీసుకొచ్చామని తెలిపారు.