బిల్లుకు ఆమోదం.. మూడు రాజధానులు ఎందుకంటే..?

బిల్లుకు ఆమోదం.. మూడు రాజధానులు ఎందుకంటే..?

రాజధాని వికేంద్రీకరణకే మొదటి నుంచి మొగ్గుచూపుతూ వస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టే రాజధాని పాలనను మూడు ప్రాంతాలకు విస్తరించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా, అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్‌గా కర్నూల్‌ను జ్యుడీషియల్ కేపిటల్‌గా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని బిల్లును ఆమోదించింది. రాజధాని వికేంద్రీకరణ అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ... సుధీర్ఘ చర్చ తర్వాత బిల్లును ఆమోదించింది.  బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అధికార పక్షం విపక్షం మాట్లాడం, అనుకూల, వ్యతిరేక ప్రసంగాలు చేయడం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ చర్చకు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సభ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించింది. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే రాజధానిని వికేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి జగన్. అమరావతిని అభివృద్ధి చేయడానికి ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి వచ్చే ఫలితాన్ని వివరించారు. అమరావతికి అన్యాయం చేయడం లేదన్నారు జగన్. అమరావతి ఏదో ఒక రోజు గొప్ప మహానగరంగా రూపుదిద్దుకుంటుదన్నారు. అమరావతి రైతులకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ప్రకటించారు.

మరోవైపు కమ్మవారికి తాము వ్యతిరేకమని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. కమ్మ, కాపు , రెడ్లు అందరి ఓట్లతోనే తాము గెలిచామని చెప్పారు. విశాఖలో కమ్మవారు లేరా అని ప్రశ్నించారు. కృష్ణాజిల్లాతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. జగన్ ప్రసంగం ముగిసిన తర్వాత రాత్రి 11 గంటలకు సభ వికేంద్రీకరణ బిల్లను ఆమోదించింది. రాష్ట్ర చరిత్రలో చరిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టే అవకాశం తనకు కల్పించారంటూ సీఎంకు థాంక్స్ చెప్పారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. సుధీర్ఘ చర్చల అనంతరం  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి సభకు పరిచయం చేసే అవకాశం దక్కడం అదృష్టంగా పేర్కొన్నారు.