30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనున్నాయి. ఏపీ శాసన సభ, శాసనమండలి సమావేశాలకు సంబంధించిన వివరాలను కార్యదర్శులు విడుదల చేశారు. జనవరి 30న ఉదయం 9.30 గంటలకు ఉభయసభలు సమావేశమవుతాయని గవర్నర్ నరసింహన్ పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఫిబ్రవరి 2న ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది.