ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన గోపిరెడ్డి

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన గోపిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 174 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నిన్న పూర్తవగా.. నరసరావుపేట వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన వెంకట అప్పల నాయుడు... గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ మూడు నిమిషాలుపాటు వాయిదా పడింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మాతృమూర్తి పెద్ద కర్మ ఉన్నందున నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.