ఫిరాయింపులపై ఆయనకు మాట్లాడే హక్కులేదు

ఫిరాయింపులపై ఆయనకు మాట్లాడే హక్కులేదు

ఫిరాయింపులపై చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు చంద్రబాబుకు ఫిరాయింపులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై చంద్రబాబు మట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించనట్లే అవుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడిపై విసుగుతోనే టీడీపీ నేతలు పార్టీ వీడుతున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అభివృద్ధి చూసే టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.