మోడీని తిట్టిన మంత్రిని పీకేయండి...

మోడీని తిట్టిన మంత్రిని పీకేయండి...

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఏపీ మంత్రులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కన్నా... ప్రధాన మంత్రి మోడీని తీవ్రంగా విమర్శించిన మంత్రి అఖిల ప్రియను ఏపీ కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా మోడీని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారుల్లో కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలే వ్యవహరిస్తున్నారని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు కన్నా లక్ష్మీనారాయణ... ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై టీడీపీ ఎంపీలకు గతంలోనే ప్రధాని మోడీ చెప్పారన్నారు కన్నా.