చంద్రబాబుపై డిజిపికి బిజెపి నేతల ఫిర్యాదు

చంద్రబాబుపై డిజిపికి బిజెపి నేతల ఫిర్యాదు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై  డిజిపికి ఏపి బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. కాకినాడ పర్యటన లో సీఎం చంద్రబాబుకు స్దానిక బిజేపి నేతలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నంచగా, దురుసు వ్యాఖ్యలు చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఓ మహిళను నడిరోడ్డు మీద పినిష్ చేస్తానని సీఎం హెచ్చరించారని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో బిజెపి నేతలపై దాడులు చేస్తామని హెచ్చరికలు వస్తున్నాయని, ఈ ఘటనలు  అన్నింటి పై విచారణ చేయాలని  ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.