తెదేపా.. వైకాపా ఉచ్చులో పడింది...బయటకు రండి... !

తెదేపా.. వైకాపా ఉచ్చులో పడింది...బయటకు రండి... !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా మోడీ ప్రభుత్వం చేసిందని... ఇంకా హామీలన్నింటినీ నెరవేరుస్తుందని భాజపా నేత హరిబాబు అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... తెదేపా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాలని కోరారు. ప్రతిపక్షాల భయానికి లోబడి మాత్రమే తెదేపా ఎన్డీఏ నుండి బయటకు వచ్చిందని ఆయన అన్నారు. కాగా ఢిల్లీలో హరిబాబు మీడియాతో మాట్లాడుతూ.... టీడీపీ మెడ మీద వైసీపీ కత్తి పెట్టింది. వైసీపీని టీడీపీ అనుసరించింది. అక్కడ అంతే జరిగింది. అందుకే తెదేపా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టింది అంటూ తెదేపా వైకాపా ఉచ్చులోంటి బయటకు రమ్మంటూ వెల్లడించారు. ఎక్కడ వైకాపా భాజపాకు దగ్గరౌతుందనే భయంలో తెదేపా ఉందని ఆయన వివరించారు. ఇంకా హరిబాబు ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.