డేటా చోరీపై గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు

డేటా చోరీపై గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు

డేటా వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయిన అనంతరం అధ్యక్షుడు కన్నా.. మీడియాతో మాట్లాడారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ 5 కోట్ల ఆంధ్రుల డాటాను టాంపర్ చేసింది. ప్రజల పర్సనల్ డేటా ను దొంగిలించారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించాయి. ప్రజాస్వామ్య లో పని చేసే అధికారుల కాకుండా పార్టీ కి పనిచేస్తున్నారు. చిన్న కేసు పై ఏపీ సీఎం తో సహా అందరూ అధికారులు మాట్లాడుతున్నారు. ఈ చిన్న కేసు పై విచారణ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. ముద్దాయి తమ దగ్గరే ఉన్నారని వాళ్ళు చెబుతున్నారు. ఏపీ లో టీడీపీ, వైసీపీ డ్రామా కంపెనీల వ్యవహరిస్తున్నాయి. నిష్పక్షపాతం గా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. సీబీఐ విచారణ జరపాలని కోరుతున్నాం. అందుకే గవర్నర్ కలిసి, వివరించాం... అని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.