విజయవాడ ధర్నాచౌక్ లో బీజేపీ ధర్నా

విజయవాడ ధర్నాచౌక్ లో బీజేపీ ధర్నా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మమతను సమర్ధిస్తున్న చంద్రబాబుపై ఈసీ చర్యలు తీసుకోవాలని అన్నారు. మోడీ ప్రభంజనం అడ్డునేందుకు రాజకీయ దొంగలంతా ఏకమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరిగి బీజేపీకి పట్టంకడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు.