'హోదా' ముగిసిపోయిన అధ్యాయం...

'హోదా' ముగిసిపోయిన అధ్యాయం...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ఇప్పటికీ ముగిసిపోయిన అధ్యాయమే అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఈ నెల 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల పర్యటన ఏర్పాట్లను పరిశీలించేఇందుకు తిరుపతి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి నిదర్శనం బీజేపీ అఖండ గెలుపు అన్నారు. రాష్ట్రంలో మాపై విషప్రచారం చేశారని మండిపడ్డ ఆయన... వైఎస్ జగన్ ట్రాప్ లో పడుతున్నావని నాడు చంద్రబాబును హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పినా... మా మాట పట్టించుకోకుండా మాపై నిందలు మోపారని విమర్శించిన కన్నా లక్ష్మీనారాయణ... ఏపీ అభివృద్ధి దేశ అభివృద్ధి అనే నినాదానికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. మేం చేసిన అభివృద్ధికి తగిన ప్రచారం లభించకపోవడం వల్లే ఏపీలో వెనుకబడ్డామని విశ్లేషించిన కన్నా... ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం.. హోదా గురించి ఇకపై ఎవరు మాట్లాడినా ప్రజలను మళ్లీ మభ్యపెట్టడమే అన్నారు.