'పాక్‌కు సరైన జవాబు ఇవ్వగల పీఎం మేడీయే..'

'పాక్‌కు సరైన జవాబు ఇవ్వగల పీఎం మేడీయే..'

పాకిస్థాన్‌కు సరైన జవాబు ఇవ్వగల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీయే అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... తిరుపతిలో బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక సైనికుడు చనిపోతే వందమంది ఉగ్రవాదులు పోతారు అని చెప్పి.. చేసి చూపించిన ప్రధాని మోడీ అన్నారు. చర్చలు జరిపే పరిస్థితి నుంచి భయపెట్టే స్ధాయికి భారత్‌ను తీసుకెళ్లిన ఘనత కూడా మోడీదే అన్నారు కన్నా. మరోవైపు ఏపీకి సహాయం చేసిన ప్రధానమంత్రి పర్యటనలను అడ్డుకోవాలని చూసిన సంస్కారహీనుడు సీఎం చంద్రబాబు అంటూ మండిపడ్డ కన్నా లక్ష్మీనారాయణ.. ఏపీ సీఎం అడ్డుకోవాలని చూసినా బీజేపీ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేశారని తెలిపారు.