హైదరాబాద్ ఫలితాలే తిరుపతిలో కూడా... 

హైదరాబాద్ ఫలితాలే తిరుపతిలో కూడా... 

దుబ్బాక ఉప ఎన్నకలో బీజేపీ విజయం తరువాత జీహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా అదే విధమైన దూకుడును ప్రదర్శించింది.  జీహెచ్ఎంసిలో 48 డివిజన్లను కైవసం చేసుకుంది.  తెలంగాణ బీజేపీని స్ఫూర్తిగా తీసుకొని అటు ఏపీలో కూడా బీజేపీ దూకుడుగా వ్యవహరించేందుకు, క్షేత్రస్తాయిలో బలం పెంచుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.  ఇందులో భాగంగా ప్రభుత్వంపైన, అటు తెలుగుదేశంపైన ఎదురుదాడికి దిగుతున్నది బీజేపీ.  బీజేపీ లక్ష్యం అభివృద్ధి, అభివృద్దే బీజేపీని గెలిపిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో కూడా రాబోతున్నాయని తెలిపారు.  తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.  ఎన్నికలకు ముందు టీడీపీ పసుపుకుంకుమ, వైసీపీ నవరత్నాలు అప్పుచేసి ఇచ్చారని అన్నారు.  2024లో బీజేపీ-జనసేనలు అధికారంలోకి రావడం ఖాయమని సోము వీర్రాజు పేర్కొన్నారు.