టీటీడీ పవిత్రను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు

టీటీడీ పవిత్రను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు

వైసీపీపై ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. టీటీడీ పవిత్రను దెబ్బతీసేలా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శ్రీవారి బంగారం తరలింపులో బ్యాంకు అధికారులు అశ్రద్ధ చూపితే దానిలో టీటీడీ బోర్డు, ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు.  కేంద్రం ఆడిస్తున్న కుట్రలో భాగంగా వైసీపీని ఒక పావుగా వినియోగించు కుంటున్నారన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయం సాధిస్తుందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.