ఏపీ బడ్జెట్‌లో కీలక అంశాలు 

ఏపీ బడ్జెట్‌లో కీలక అంశాలు 

రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మహాత్ముని లక్ష్యం సాధించే దిశగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యమని, ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల హామీలో ఓ దృక్పథం ఉందని అన్నారు. 

బుగ్గన ప్రసంగంలో ముఖ్యాంశాలు..

 • మేనిఫెస్టో మాకొక నియమావళి
 • మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తాం
 • అన్ని రంగాల సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం
 • రాయలసీమకు నీరు అందిస్తాం
 • ఉత్తరాంధ్రలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
 • సాగునీటి రంగంలో అవినీతిని అరికట్టేందుకు జుడీషియల్‌ కమిషన్‌
 • పేదల కన్నీటిని తుడిచే దిశగా ప్రభుత్వం చర్యలు
 • ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం
 • జన్మభూమి కమటీలకు, మా ప్రభుత్వానికి తేడా ఉంది
 • ప్రతి గ్రామానికీ తాగునీరు
 • అన్ని కాంట్రాక్టుల్లో పారదర్శకత పాటిస్తాం
 • గోదావరి జలాల్ని రాయలసీమకు తీసుకొస్తాం