ఏపీ బడ్జెట్‌: ఏ పథకానికి ఎన్ని నిధులు..? 

ఏపీ బడ్జెట్‌: ఏ పథకానికి ఎన్ని నిధులు..? 

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,27,974.99 కోట్లతో బడ్జెట్‌కు రూపకల్పన చేశారు.  రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94కోట్లుకాగా.. మూలధన వ్యయం రూ.32,293.39కోట్లు. రెవెన్యూ లోటు రూ.1,778.52 కోట్లు.

బడ్జెట్‌లో కేటాయింపులు ఇవీ...

  • సంక్షేమ రంగానికి రూ.14,412కోట్లు
  • వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రూ.8,550కోట్లు
  • అమ్మ ఒడి పథకానికి రూ.6455కోట్లు
  • రైతుల ఉచిత విద్యుత్‌కు  రూ.4,525కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు
  • వైద్య రంగానికి రూ.11399కోట్లు
  • గ‌‌ృహ నిర్మాణాలకు రూ.3617కోట్లు
  • ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002కోట్లు 
  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140కోట్లు 
  • పట్టణ స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణం కింద రూ.648కోట్లు 
  • ఏపీఎస్‌ఆర్టీసీకి సహాయార్థం రూ.1000కోట్లు
  • ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.260కోట్లు
  • పౌరసరఫరాలశాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు 
  • బియ్యం తదితర సరకుల సరఫరాకు రూ.750కోట్లు
  • పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం కింద రూ.384కోట్లు
  • పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.1500కోట్లు
  • అక్షయపాత్ర ఫౌండేషన్‌ వంటశాలల నిర్మాణానికి రూ.100కోట్లు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.573.60కోట్లు
  • పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250కోట్లు
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం రూ.200కోట్లు
  • పారిశ్రామిక కల్పన కింద రూ.250కోట్లు
  • గ్రామ సచివాలయాల కోసం రూ.700కోట్లు
  • రాష్ట్ర అభివృద్ధి పథకాల అంచనా వ్యయం రూ.92,050.05కోట్లు 
  • ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,000కోట్లు
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4988.52కోట్లు
  • బీసీ సబ్‌ ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,061.64కోట్లు
  • మున్సిపల్‌ వార్డు వలంటీర్ల కోసం రూ.280కోట్లు
  • మున్సిపల్‌ వార్డు సచివాలయాల కోసం రూ.180కోట్లు 
  • న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100కోట్లు
  • న్యాయవాదుల ఆర్థిక సాయం కింద రూ.10కోట్లు
  • బీసీలకు వైఎస్సార్‌ కల్యాణ కానుక కింద రూ.300కోట్లు
  • ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణ కానుక కింద రూ.200కోట్లు
  • ఎస్టీలకు వైఎస్సార్‌ గిరి పుత్రిక కల్యాణ కానుక కింద రూ.45కోట్లు
  • మైనార్టీలకు వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ.100కోట్లు
  • ఆశావర్కర్లకు రూ.455.85కోట్లు
  • ఆటో డ్రైవర్ల ఆర్థికసాయం కింద రూ.400కోట్లు
  • కాపుల సంక్షేమానికి రూ.2000కోట్లు. 
  • అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150కోట్లు 
  • వైఎస్సార్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు
  • చేనేత కార్మికులకు వైఎస్సార్‌ భరోసా కింద రూ.200కోట్లు.
  • ఆర్థిక రంగ సేవల కోసం రూ.86,105.63కోట్లు
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677.08కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ.29,329.98కోట్లు
  • జలవనరుల కోసం రూ.13,139.05కోట్లు
  • తాగునీరు, వరద నియంత్రణ కింద రూ.13,139.05కోట్లు
  • విద్యుత్‌శాఖకు రూ.6,861.03కోట్లు. ఖనిజాభివృద్ధి శాఖకు రూ.3,986.05కోట్లు