ఏపీ బడ్జెట్: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

ఏపీ బడ్జెట్: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రాష్ట్రానికి సంబంధించిన 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. ఆ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ.. వ్యవసాయ బడ్జెట్‌ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందుంచారు. అయితే, ఏపీ బడ్జెట్ 2018-2019, తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మధ్య ఉన్న తేడా.. వాటి కేటాయింపులు ఇలా ఉన్నాయి. ఈ సారి బడ్జెట్‌లో ఆర్జితసేవల శాఖల కేటాయింపులు 26 శాతం పెరిగాయి. ఆర్జిత సేవల శాఖలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.86,185 కోట్లు కేటాయించగా.. 2018-19లో రూ.67,917 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇక, సామాజిక సేవల శాఖల కేటాయింపులు 12 శాతం పెరిగాయి. ప్రస్తుత బడ్జెట్‌లో సామాజిక సేవల శాఖాలకు రూ.75,465 కోట్లు కేటాయించగా.. 2018-19 బడ్జెట్లో రూ. 67,032 కోట్లు కేటాయించారు. 

నిధులు పెరిగిన శాఖల వివరాలు:
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే 67శాతం పెరుగుదల.. 2018-19 బడ్జెట్‌లో రూ.12,355 కోట్లు కేటాయింపు.
* గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రస్తుత కేటాయింపులు రూ. 29,329 కోట్లు.. గత ఏడాదితో పోలిస్తే 40శాతం పెరుగుదల.. బడ్జెట్‌ 2018-19లో రూ. 20,815 కోట్లు కేటాయింపు.
* ఇంధన శాఖకు రూ. 6,861 కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే 63శాతం పెంపు.. 2018-2019లో ఇంధన శాఖకు రూ.4,193 కోట్లు కేటాయింపు.
* రవాణాశాఖకు ప్రస్తుత కేటాయింపులు రూ. 6,157 కోట్లు.. గత ఏడాదితో పోలిస్తే 32శాతం పెరుగుదల.. బడ్జెట్‌ 2018-19లో రూ. 4,653 కోట్లు కేటాయింపు.
* విద్యా శాఖకు ప్రస్తుత కేటాయింపులు రూ.32,618కోట్లు.. గత ఏడాదితో పోలిస్తే 34 శాతం పెంపు.. 2018-19లో విద్యకు రూ. 24,185కోట్ల కేటాయింపు.
* వైద్య శాఖకు ప్రస్తుత కేటాయింపులు రూ.11,399కోట్లు.. గత ఏడాదితో పోలిస్తే 34 శాతం అధికం.. 2018-19లో వైద్య శాఖకు రూ.8,463 కోట్ల కేటాయింపు.
* సంక్షేమం కోసం ప్రస్తుత బడ్జెట్ లో రూ. 14,142 కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరుగుదల.. 2018-19లో సంక్షేమానికి రూ.13,722 కోట్లు కేటాయింపు.
* కార్మిక, ఉపాధి శాఖకు ప్రస్తుతం రూ. 978కోట్లు  కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం పెరుగుదల.. 2018-19లో రూ. 814 కోట్లు కేటాయింపు.

బడ్జెట్‌లో నిధులు తగ్గిన శాఖలు:
* జలవనరుల శాఖకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.13,139 కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే 22 శాతం తగ్గుదల.. 2018-19లో రూ.16,978 కోట్లు కేటాయింపు.
* పరిశ్రమల శాఖకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,986కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే సుమారు ఒక శాతం తగ్గుదల.. 2018-19లో పరిశ్రమలశాఖకు రూ.4,021 కోట్లు కేటాయింపు.
* క్రీడలు, యువజన సర్వీసులు శాఖకు భారీగా తగ్గింపు.. ప్రస్తుత బడ్జెట్ లో రూ.329 కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే 79 శాతం తగ్గుదల.. 2018-19లో రూ. 1,635 కోట్లు కేటాయింపు.
* సాంకేతిక విద్యకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.580కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే 29 శాతం తగ్గుదల.. 2018-19లో రూ.818 కోట్లు కేటాయింపు.
* నీటి సరఫరా, పారిశుధ్యానికి ప్రస్తుత బడ్జెట్లో రూ.2,234 కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే 14శాతం తగ్గుదల.. 2018-19లో రూ.2,623 కోట్లు కేటాయింపు.
* హౌసింగ్ శాఖకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,617 కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే ఒకటిన్నర శాతం తగ్గుదల.. 2018-19లో రూ.3,679 కోట్లు కేటాయింపు.
* పట్టణాభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6,587 కోట్లు కేటాయింపు.. గత ఏడాదితో పోలిస్తే 14శాతం తగ్గుదల.. 2018-19లో రూ. 7,740 కోట్లు కేటాయింపు.