కేబినెట్ లో కీలక నిర్ణయాలు

కేబినెట్ లో కీలక నిర్ణయాలు

జయహో బీసి హామీలపై సిఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కసరత్తు చేసింది.నాయీ బ్రాహ్మణులకు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ కు ఆమోదం తెలిపింది. ఏలూరు లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాబోయే మూడేళ్ళలో మెడికల్ కళాశాల కోసం 260 కోట్లు ఖర్చు చెయ్యాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 9న భారీ ఎత్తున సామూహిక గృహ ప్రవేశాల పండుగ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా నెల్లూరు లో జరిగే గృహ ప్రవేశాల వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.అదే రోజు రాష్ట్ర వ్యాప్తం గా 4 లక్షల గృహలను లబ్ధిదారులకు ఆందజేయనున్నారు. అర్బన్ లో లక్ష, రూరల్ లో 3 లక్షలు ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తారు. విశాఖ జిల్లా ఆనందపురం గిడిజాల గ్రామం లో మహిళ పారిశ్రామిక వేత్తలకు 50 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.