ఏపీ కెబినెట్‌: మరో కొత్త పథకానికి ఆమోదం..!

ఏపీ కెబినెట్‌: మరో కొత్త పథకానికి ఆమోదం..!

అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలకమైన చర్చ జరిగింది.. మరో కొత్త పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. చేనేత కుటుంబాలకు ఆర్ధిక సాయంపై కేబినెట్‌లో చర్చించారు సీఎం వైఎస్ జగన్.. ఏడాదికి రూ. 24 వేల మేర ఆర్ధిక సాయాన్ని "వైఎస్సార్ చేనేత నేస్తం" పేరుతో అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. "చేనేత నేస్తం" పథకానికి రూ. 216 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు.. ప్రతీ ఏడాది డిసెండర్ 21వ తేదీన చేనేత కుటుంబాలకు బ్యాంక్ ద్వారా ఆర్ధిక సాయం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకే విడతగా రూ. 24 వేలు ఆర్థిక సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.. ఇక, చేనేత నేస్తం పథకం ద్వారా రాష్ట్రంలోని 90 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.