ఏపీ కేబినెట్‌ సంచలన నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ సంచలన నిర్ణయాలు

సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ తొలి కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా.. ఆశా వర్కర్లు, కమ్యూనిటీ వర్కర్లు, హోంగార్డులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్ల జీతాల పెంపుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ భేటీ ఆమోదించిన కీలక నిర్ణయాలను మంత్రి పేర్ని నాని విలేఖరులకు వెల్లడించారు.

 • ఆశా వర్కర్ల వేతనాలు రూ.10వేలకు పెంపు.
 • అంగన్‌వాడీ, హోంగార్డుల జీతాల పెంపు.
 • పీవోఏ, ఏర్పీఏల జీతం రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంపు.
 • మున్సిపల్,  పారిశుధ్య కార్మికుల జీతం రూ.18వేలకు పెంపు.
 • గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు రూ.400 నుంచి రూ.4వేలకు పెంపు. 
 • పొదుపు మహిళ సంఘాల యానిమేటర్లకు రూ.10 వేల గౌరవ వేతనం.
 • అంగన్‌వాడీ వర్కర్లకు రూ.11.500 వేతనం.
 • పౌర సరఫరాల ద్వారా బియ్యం ఇక అత్యంత నాణ్యతతో ప్యాకెట్ల రూపంలో సెప్టెంబర్ 1 నుంచి పంపిణీ. నేరుగా డోర్‌ డెలివరీ.
 • ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనానికి  కమిటీ ఏర్పాటు. 3 నెలల్లో నివేదిక ఇవ్వనున్న కమిటీ.
 • సీపీఎస్ రద్దుపై కమిటీ ఏర్పాటు.
 • 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
 • టీటీడీ పాలకమండలిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం. నామినేటెడ్‌ పదవులు రద్దు. 
 • ఏపీ రైతు కమిషన్‌ ఏర్పాటు.
 • అక్టోబర్ నుంచి రైతు భరోసా అమలు.
 • రైతులకు వడ్డీ లేని రుణాలు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు
 • రైతులకు ఉచిత బోర్ల కోసం 200 రిగ్గుల ఏర్పాటు.
 • పారదర్శకంగా ఇసుక విధానం.
 • వైఎస్సార్ ఆసరా పథకం కింద పింఛన్లను రూ.2250 పెంపును కేబినెట్ ఓకే.
 • రైతు బీమాకు ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం.
 • జనవరి 26 నుంచి అమ్మఒడి పథకం అమలు.
 • జులై నుంచి 27శాతం ఐఆర్ పెంపునకు  కేబినెట్ ఆమోదం. పెంచిన ఐఆర్‌ను 2018 జులై నుంచి ఇవ్వాలని నిర్ణయం.
 • ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 50 ఇళ్లకు గ్రామ వలంటీర్ల నియామకం.
 • ఆగస్టు 15 లోపు గ్రామ వలంటీర్ల నియామకం. గ్రామ వలంటీర్ల విద్యార్హత ఇంటర్. పట్టణాల్లో విద్యార్హత డిగ్రీ. గిరిజన ప్రాంతాల్లో టెన్త్‌.
 • నవరత్నాల్లో ఒకటైన 'రైతు భరోసా' అక్టోబర్ 15న ప్రారంభం. ప్రతి రైతుకూ రూ.12,500 చెల్లింపు. 50 లక్షల రైతు కుటుంబాలకు ఆసరా.
 • ఏపీ  రైతు కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం. ఆరు నుంచి ఏడు మందితో సీఎం అధ్యక్షతన కమిటీ.
 • ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల, కన్సల్టెన్సీలను రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయం. ఆ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకునేందుకు సీఎస్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు.
 • ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలను కొనుగోలుచేసి ఉగాది రోజున రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ.