రేపు ఉదయం 9 గంటలకు రాజధాని ముహూర్తం... 

రేపు ఉదయం 9 గంటలకు రాజధాని ముహూర్తం... 

ఆంధ్రప్రదేశ్ కు ఒకటే రాజధాని ఉంటుందా లేదంటే మూడు రాజధానులు ఉంటాయా అనే విషయం రేపటితో తేలిపోతున్నది.  రేపు ఉదయం 9 గంటలకు క్యాబినెట్ మీటింగ్ జరగబోతున్నది.   ఈ సమావేశంలో మంత్రులు మొత్తం హాజరు కాబోతున్నాయి.  మంత్రి వర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదిక గురించి, అలానే జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ గ్రూప్ నివేదిక గురించి కూడా చర్చించబోతున్నారు.  ఈ మీటింగ్ అనంతరం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుగుతుంది.  

ఈ సమావేశంలో  దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారు.  ఆ తరువాత ఈనెల 21 వ తేదీన మండలి సమావేశంలో బిల్లుపై చర్చ జరుగుతుంది.  రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందితే చట్టం అవుతుంది.  శాసనసభను అమరావతి నుంచి విశాఖకు మార్చే అధికారం ప్రభుత్వానికి వస్తుంది.  ఒకటే ఉంటుందా మూడు ఉంటాయా అనే విషయం రేపు ఉదయం 9 గంటలకు తేలిపోతుంది.