ఈ నెల 19న ఏపీ కేబినెట్ స‌మావేశం..!

 ఈ నెల 19న ఏపీ కేబినెట్ స‌మావేశం..!

ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ స‌మావేశం కానుంది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించే ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క‌మైన అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా ఉదృతి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల పై చర్చించనున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై కూడా చర్చించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై కమిటీ వేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై కూడా ప్రధానంగా చర్చించనున్నారు.