నేడు ఏపీ కేబినెట్‌ భేటీ...చర్చకు కీలక అంశాలు !

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ...చర్చకు కీలక అంశాలు !

ఇవాళ ఏపీ కేబినెట్‌ భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు మంత్రివర్గం ముందుకు రానున్నాయి. ఇసుక అక్రమార్కులకు రెండేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టంలో మార్పుతో పాటు.. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు,  అసైన్డ్ భూములు ఉన్న దళితులకు మార్కెట్ రేటు కంటే పది శాతం ఎక్కువ పరిహారం ఇచ్చే అంశాలపైనా చర్చ జరగనుంది. పై కోర్టుల‌పై భారం త‌గ్గించేందుకు.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గ్రామ న్యాయాల‌యాల‌ను ఏపిలో ఏర్పాటు చేసేలా మంత్రి వ‌ర్గం ముందుకు ప్రపోజల్స్ రానున్నాయి. సెల్ డీడ్ రిజిస్ట్రేషన్ డ్యాక్యుమెంట్లు ఉన్న అక్రమ ప్లాట్స్, ఇల్లీగల్‌ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసే అంశం కూడా ఈ క్యాబినెట్‌ భేటీలో చర్చకు రానుంది. ఏపీలో ఎప్పుడో 12 ఏళ్ల క్రితం అక్రమ ప్లాట్స్, ఇల్లిగ‌ల్ లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేశారు. ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. 2019,అగ‌స్టు 31 వ‌ర‌కు, సెల్ డిడ్ రిజిస్ట్రేన్ డ్యాక్యుమెంట్లు ఉన్న వాటిల్ని రెగ్యుల‌రైజ్ చేసే ప్రతిపాదనపై క్యాబినెట్ చర్చించనుంది. బిల్డర్లతో పాటు అక్రమ లే అవుట్స్ లో ఫ్లాట్స్ కొనుగోలు చేసుకున్న వారికి ఊరట ఇవ్వనుంది.