నేడే ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ.. అజెండా ఇదే..

నేడే ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ.. అజెండా ఇదే..

ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడు చూపిస్తూనే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నవరత్నాలతో పాటు.. కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరచేసే ప్రయత్నం చేస్తున్నారు... ఇక, ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం కాబోతుంది. కార్పోరేషన్లు, బోర్డుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల నిర్వహణకున్న సాంకేతిక అడ్డంకులను అధిగమించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చేనేత కార్మిక కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయానికి ఆమోదం తెల్పనుంది. మరోవైపు మత్స్యకారుల సంక్షేమం విషయంలో మరో నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది సర్కార్. ఇక డ్వాక్రా మహిళల కోసం వైఎస్సార్ క్రాంతిపథకాన్ని మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వివాదంగా ఉన్న పోలవరం, రాజధాని నిర్మాణం, పీపీఏల వంటి అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ కన్పిస్తోంది. మొత్తం 15 అంశాలతో కూడిన అజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం అవుతోంది.